గుంటూరు జిల్లాలో టెన్షన్..టెన్షన్..ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా దాచేపల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కి కోవిడ్ సోకింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఆర్ఎంపీ దగ్గర ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎవరి ద్వారా ఆర్ఎంపీకి వ్యాధి సంక్రమించింది అనే కోణంలోనూ డిటేల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న వారు స్వతహాగా కరోనా టెస్టులు చేయుంచుకోవాలని..లేకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా […]

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా దాచేపల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కి కోవిడ్ సోకింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఆర్ఎంపీ దగ్గర ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎవరి ద్వారా ఆర్ఎంపీకి వ్యాధి సంక్రమించింది అనే కోణంలోనూ డిటేల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న వారు స్వతహాగా కరోనా టెస్టులు చేయుంచుకోవాలని..లేకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మహమ్మారి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో దాచేపల్లి మండలంలో 300 మంది ప్రజలు పరీక్షల చేయించుకునేందుకు ముందుకువచ్చారు. వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరిస్తున్నారు.