స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్‌!

| Edited By:

Mar 09, 2020 | 10:38 PM

నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో అత్యంత విలువైన కంపెనీల జాబితా కూడా తారుమారు అయింది. టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా

స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్‌!
Follow us on

నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో అత్యంత విలువైన కంపెనీల జాబితా కూడా తారుమారు అయింది. టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. చమురు ధరలు పడిపోవడం రిలయన్స్‌ షేర్‌కు శరాఘాతంగా మారింది. దీంతో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రిలయన్స్‌ షేరు 13శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా రూ.10లక్షల కోట్లుగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 7.05 లక్షల కోట్లకు చేరింది.

మరోవైపు.. టీసీఎస్‌ విలువ కూడా పతనమైనా.. అది తక్కువగా ఉంది. నేటి ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు ధర 6శాతానికి పైగా పతనమైంది. అయితే మార్కెట్‌ విలువ రూ. 7.40 లక్షల కోట్లుగా ఉండటంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్‌ తొలిస్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ బెంచ్‌ మార్క్‌ క్రూడ్‌ ఫ్యూచర్లు 30శాతం పతనం కావడం రిలయన్స్‌పై ప్రభావం చూపింది. 1991 తర్వాత మార్కెట్లలో ఒక్కరోజులో పడిన అత్యధిక విలువ ఇదే కావడం గమనార్హం.