కరోనా పేషెంట్స్ కి రోబో సేవలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 5:37 PM

కరోనా పేషెంట్స్ కి మేము సైతం అంటూ సేవలందిస్తున్నాయి రోబోలు. అది కూడా చీర కట్టులో వైద్య సిబ్బంది తరహాలో తెల్లసూట్ వేసుకుని విధులు నిర్వహిస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులకు సేవ చేసేందుకు అస్సాంకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని రోబోట్లను అందించారు.

కరోనా పేషెంట్స్ కి రోబో సేవలు
Follow us on

కరోనా పేషెంట్స్ కి మేము సైతం అంటూ సేవలందిస్తున్నాయి రోబోలు. అది కూడా చీర కట్టులో వైద్య సిబ్బంది తరహాలో తెల్లసూట్ వేసుకుని విధులు నిర్వహిస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులకు సేవ చేసేందుకు అస్సాంకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని రోబోట్లను అందించారు. గౌహతీలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఎస్ఎన్ ఫరీద్.. ఏడాదిన్నరగా తమ కస్టమర్లకు రోబోట్ల ద్వారా ఆహారం, పానీయాలు అందించేవారు. తాజాగా ఆ రోబోట్లను కరోనా వైరస్ బాధితులకు సేవలు అందించేందుకు హెల్త్ వర్కర్లకు సాయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈ రోబోట్ల సాయంతో వైద్యులు బాధితుల వద్దకు వెళ్లకుండానే చికిత్స అందిస్తున్నారు. ఈ రోబోట్లు పేషేంట్లకు కావల్సిన ఆహారంతో పాటు మందులు తీసుకెళ్లోంది.