కరోనా ఎఫెక్ట్: మా రక్షణ సంగతేంటి.. వైద్యుల ధర్నా..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2020 | 8:43 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులకు చికిత్స అందించే వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఔరంగబాద్‌లోని

కరోనా ఎఫెక్ట్: మా రక్షణ సంగతేంటి.. వైద్యుల ధర్నా..!
Follow us on

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులకు చికిత్స అందించే వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఔరంగబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని జూనియర్‌ వైద్యులు తమకు కరోనా వైరస్‌ సోకకుండా అవసరమైన పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌), ఎన్‌ 95 మాస్కులను అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ధర్నా చేశారు. ఆస్పత్రిలోని ఇద్దరు రోగులు, సిబ్బంది ఒకరికి ఇటీవలే కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. దీనికి సంబంధించి వైద్య కళాశాల డీన్‌కు మెమొరాండం సమర్పించారు.

తాజాగా.. కరోనా ఇప్పుడు భారత్ లోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. మహారాష్ట్ర వైద్యుల సంఘం ఔరంగబాద్‌ యూనిట్‌ సంఘం అధ్యక్షుడు డా.ఆమీర్‌ తాడ్వీ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని తెలిసినా వ్యక్తిగత రక్షణ కిట్‌లను అందించకపోవటం దారుణమన్నారు. రోజూ 50 నుంచి 100 మంది రోగులకు చికిత్స అందించాల్సి ఉంది. మాస్కుల్లేకుండా వార్డుల్లోకి వెళితే చాలా ప్రమాదం అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం తమ డిమాండ్‌లను ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికి తెలిపామన్నారు.