AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జ‌గ‌న్ కు నారా లోకేశ్ లేఖ‌..

పొగాకు రైతులను కరోనా తీవ్రంగా దెబ్బ‌తీసింద‌ని నారా లోకేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేవారు. ఏపీలో రైతులు గత ఏడాది కిలో పొగాకు 170 రూపాయల చొప్పున విక్ర‌యాలు జ‌రిపార‌ని, ఇప్పుడు అది 130 నుంచి 150 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని వివ‌రించారు. వారిని గ‌వ‌ర్న‌మెంట్ వెంట‌నే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పొగాకు వేలం సరిగా జరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని..ఈ-వేలంలో త‌క్కువ ధ‌ర‌లు ప‌ల‌క‌డం వ‌ల్ల‌ రైతులను […]

సీఎం జ‌గ‌న్ కు నారా లోకేశ్ లేఖ‌..
Ram Naramaneni
|

Updated on: May 23, 2020 | 3:07 PM

Share

పొగాకు రైతులను కరోనా తీవ్రంగా దెబ్బ‌తీసింద‌ని నారా లోకేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేవారు. ఏపీలో రైతులు గత ఏడాది కిలో పొగాకు 170 రూపాయల చొప్పున విక్ర‌యాలు జ‌రిపార‌ని, ఇప్పుడు అది 130 నుంచి 150 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని వివ‌రించారు. వారిని గ‌వ‌ర్న‌మెంట్ వెంట‌నే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పొగాకు వేలం సరిగా జరిగ్గా జ‌ర‌గ‌డం లేద‌ని..ఈ-వేలంలో త‌క్కువ ధ‌ర‌లు ప‌ల‌క‌డం వ‌ల్ల‌ రైతులను తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా స‌రైన స‌మ‌యంలో రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోలేక.. 40 రోజుల పాటు నిల్వ చేసుకున్నారని తెలిపారు.

ఇప్పుడు అమ్మ‌కాలు జ‌రుపుదామంటే.. నాణ్యత తగ్గిందనే సాకు చూపుతుండటంతో రైతుల‌కు న‌ష్టాలు త‌ప్ప‌ట్లేద‌ని లోకేశ్ వివ‌రించారు. తాజా సంక్షోభ స‌మ‌యంలో.. రైతులకు పొగాకు బార్న్‌పై దాదాపు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంద‌ని లోకేష్ వెల్ల‌డించారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేశారనే ఆందోళ‌న రైతుల నుంచి వ్య‌క్తమ‌వుతుంద‌ని తెలిపారు. ఒక ప్రతినిధుల బృందాన్ని..పొగాకు రైతులతో ఢిల్లీకి పంపాలని, కేంద్రం ప్ర‌భుత్వంతో పొగాకు రైతుల సమస్యను చర్చించి వారికి న్యాయం జరిగేలా ప్ర‌భుత్వం చూడాల‌ని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అవ‌కాశం చేసుకుని రైతుల‌కు ఇబ్బందిపెడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు.

Follow Us
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం!మనుషులు జీవించలేని ఆవింత ద్వీపం రహస్యం
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం!మనుషులు జీవించలేని ఆవింత ద్వీపం రహస్యం