Renault Launch suv kiger: రెనాల్ట్ కార్ల సంస్థ వినియోగదారులకు శుభవార్త.. ఈ నెలఖరులో అద్భుతమైన..

Renault Launch suv kiger: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన వినియోగదారులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. దేశీ వాహన అభిమానులు

Renault Launch suv kiger: రెనాల్ట్ కార్ల సంస్థ వినియోగదారులకు శుభవార్త.. ఈ నెలఖరులో అద్భుతమైన..

Updated on: Jan 05, 2021 | 9:11 PM

Renault Launch suv kiger: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన వినియోగదారులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. దేశీ వాహన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కిగర్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌ను మొదటగా భారత్‌లో విడుదల చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలియజేసింది.

కిగర్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ విటారా బ్రెజా, హ్యూండాయ్ వెన్యూ, కియా సొనెట్, టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్ లాంటి మోడళ్లతో పోటీ పడనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరికొత్త కిగర్ అత్యాధునిక ఫీచర్లతో రానుందని, ఈ మోడల్ ఉత్తమ స్టైలింగ్‌తో బెస్ట్-ఇన్ క్లాస్ డిజైన్‌తో వస్తుందని కంపెనీ వివరించింది. కిగర్‌ను బి-సెగ్మెంట్‌లో లభిస్తుందని, మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో 50 శాతానికిపైగా వాటాను దక్కించుకోగలదని, దేశవ్యాప్తంగా కంపెనీ ఉనికిని పెంచేందుకు ఈ మోడల్ ఎంతో సహాయపడుతుందని నమ్ముతున్నట్టు కంపెనీ వెల్లడించింది.

మాట్లాడే కారును ఎప్పుడైనా చూశారా.. స్టీరింగ్ అసలే ఉండదు.. వింత ఆకారంలో టైర్లు.. మెర్సిడెస్ కంపెనీ నూతన ఆవిష్కరణ..

కమర్షియల్ వాహనదారులకు తెలంగాణ సర్కార్ నూతన సంవత్సర కానుక.. ఆరు నెలల వాహన పన్నును రద్దు