మాట్లాడే కారును ఎప్పుడైనా చూశారా.. స్టీరింగ్ అసలే ఉండదు.. వింత ఆకారంలో టైర్లు.. మెర్సిడెస్ కంపెనీ నూతన ఆవిష్కరణ..

కారు అనేది ప్రస్తుత సమాజంలో నిత్యావసర సరుకుగా మారిపోయింది. చాలామంది కారును ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. బ్యాంకులు కూడా అందుకు తగిన విధంగా లోన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. దీంతో కార్ల కంపెనీలు రకరకాల కార్లను తయారుచేస్తున్నారు.

మాట్లాడే కారును ఎప్పుడైనా చూశారా.. స్టీరింగ్ అసలే ఉండదు.. వింత ఆకారంలో టైర్లు.. మెర్సిడెస్ కంపెనీ నూతన ఆవిష్కరణ..
Follow us

|

Updated on: Nov 25, 2020 | 5:59 PM

కారు అనేది ప్రస్తుత సమాజంలో నిత్యావసర సరుకుగా మారిపోయింది. చాలామంది కారును ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. బ్యాంకులు కూడా అందుకు తగిన విధంగా లోన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. దీంతో కార్ల కంపెనీలు రకరకాల కార్లను తయారుచేస్తున్నారు. రకరకాల ఫీచర్లతో ఆకర్షనీయ ధరల్లో అందిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే కారు ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్ రూపొందించింది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో కలిసి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఒక అధునాతన కారును సిద్ధం చేశారు. ఇవాటి ఆలోచనలే మనం రేపు పాటించబోయే ప్రమాణాలు అనే నినాదంతో ఈ కారును క్రియేట్ చేశామని మెర్సిడెజ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కారు గురించి వివరిస్తూ 12 నిమిషాల వీడియోను కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు. మరి ఈ కారుకు ఉండే ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..

ఈ కారు టైర్లను జంతువు, పువ్వు, ఆకృతులను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. అందుకే అన్నికార్లకు ఉండే చక్రాల మాదిరిగా కాకుండా గుండ్రంగా ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఇరుకు ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి అనువుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే కారులో స్టీరింగ్ బదులుగా ఒక ప్యాడ్‌ను అమర్చారు. దీనిని ఆపరేటింగ్ చేయడానికి సీటు పక్కన ఒక సెంట్రల్ కంట్రోల్ ప్యాడ్‌ను అమర్చారు. దానిపై చెయ్యి పెట్టి ముందుకంటే ముందుకు, వెనుకకంటే వెనుకకు, పక్కకంటే పక్కకు వెళుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ కారు మీతో మాట్లాడుతుంది. మన శరీర స్పందనలను బట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. దీనిని మొదటిసారిగా జనవరిలో అమెరికాలోని లాస్ వేగాస్‌లో ప్రదర్శించారు. ఇలా వింత కారు తయారుచేసి మెర్సిడజ్ కార్ల కంపెనీకి సవాల్ విసిరింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ