గోదావరి నుంచి మూడు డెల్టాలకు నీరు విడుద‌ల‌

|

Sep 02, 2020 | 12:41 PM

పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నుంచి మూడు డెల్టాలకు 9,800 క్యూసెక్కుల సాగునీరు రిలీజ్ చేశారు. పశ్చిమడెల్టాకు 5 వేలు, తూర్పుడెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,800 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు.

గోదావరి నుంచి మూడు డెల్టాలకు నీరు విడుద‌ల‌
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నుంచి మూడు డెల్టాలకు 9,800 క్యూసెక్కుల సాగునీరు రిలీజ్ చేశారు. పశ్చిమడెల్టాకు 5 వేలు, తూర్పుడెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,800 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. నరసాపురం కాలువకు 1,704, ఉండి కాలువకు 876 , ఏలూరు కాలువకు 737, జీఅండ్‌వీ కాలువకు 673, అత్తిలి కాలువలోకి 431 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు వ‌దిలారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమ‌క్ర‌మంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 41అడుగులకు చేరింది. గోదావరిలో ప్ర‌స్తుతం 7,72,359 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

 

Also Read :

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు

. పవన్‌ బర్త్‌డే: సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది