డ్రెస్ కోడ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు.. భక్తుల ముసుగుల్లో అడవుల్లోకి..ఎర్రడొంక ఇలా కదిలింది..

|

Dec 16, 2020 | 9:56 PM

అడవుల్లోకి వెళ్లాలి.. ఎర్రచందనం దుంగలను దొంగలించాలి. ఇదే టార్గెట్‌గా స్మగ్లర్లు వేస్తున్న ఎత్తుగడలను చూస్తేంటే.. ఆశ్చర్యం వేస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు మైండ్ బ్లాంక్ అవుతోంది.

డ్రెస్ కోడ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు.. భక్తుల ముసుగుల్లో అడవుల్లోకి..ఎర్రడొంక ఇలా కదిలింది..
Follow us on

Red Sandalwood Smugglers : శేషాచలం కొండ నుంచి ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న రెడ్ స్మగ్లర్లు వేస్తున్న ఎత్తుడగడలు .. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ నిఘా పెరగడంతో.. పక్కా ప్లాన్‌తో స్మగ్లర్లను అడవిలోకి పంపిస్తున్నారు రెడ్ డాన్స్‌. భక్తుల ముసుగులో ఎర్రచందనం చెట్లు నరికి తేవడానికి కూలీలను అడవుల్లోకి పంపిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చేటప్పుడు పక్కా ట్రైనింగ్ ఇచ్చి మరీ తీసుకొస్తున్నారు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా డ్రస్సులు కూడా కొనిస్తున్నారు. శేషాచలం అడవుల్లోకి వెళ్తున్న ఓ కూలీని అరెస్ట్ చేయడంతో.. ఈ వ్యవహారం అంతా బయటపడింది..

శేషాచలం అడవుల్లోకి కూలీలు వెళ్లే మార్గాలపై నిఘా పెంచడంతో.. స్మగ్లర్లు కూడా రూటు మార్చారు. భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉండే శ్రీవారి మెట్టు మార్గం మీదుగా కూలీలను అడవుల్లోకి పంపిస్తున్నారు. కూలీలను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం.. వాళ్లకు డ్రెస్‌కోడ్‌ను సెట్‌ చేశారు. బస్సులో వచ్చేటప్పుడు తెల్ల దుస్తులు వేసుకుని రావాలి.. ఇక బస్సు దిగి కొండ ఎక్కేటప్పుడు ఈ డ్రస్సును మార్చేయాలి. తెల్ల బట్టలు విప్పేసి కాషాయరంగు దుస్తులు వేసుకోవాలి. దేవుడి నామం స్మరిస్తూ.. కొండ ఎక్కాలి. అడవిలోకి అడుగు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం.. కాషాయ దుస్తులు విప్పేసి.. బనియన్‌ నిక్కర్‌లోకి గెటప్‌ మార్చేయాలి.. ఇదీ స్మగ్లర్ల ప్లానింగ్.. దీన్ని యాజిటీజ్‌గా ఫాలో అవుతున్నారు తమిళనాడు నుంచి వస్తున్న కూలీలు. అయితే.. ఇలానే గెటప్‌ మార్చుతున్న సమయంలో ఓ కూలీని పోలీసులు పట్టుకోవడంతో.. ఈ గుట్టు రట్టయ్యింది..

శ్రీవారి మెట్టు మార్గం మీదుగా స్మగ్లింగ్ జరుగుతుందని టాస్క్‌ఫోర్స్ గుర్తించినా.. ఈ కూలీలు ఎప్పుడు .. ఎలా వెళ్తున్నారన్నది మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు అరెస్ట్ అయిన కూలీ అసలు విషయం చెప్పడంతో నోరెళ్లబెట్టారు.