
కరోనా మహమ్మారి సమాజాన్ని సామాజికంగా దూరం జరిపినా.. కుటుంబ బాంధవ్యాల్ని మాత్రం బాగానే దగ్గర చేసింది. రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతూ.. ఫ్యామిలీకి తగినంత టైం స్పెండ్ చేయాలేని వాళ్లు సైతం. ఇంట్లోనే గడుపుతూ సందడి చేశారు. ఎవరి వ్యాపకాల్లో వాళ్లు తమ అభిరుచుల్ని తీర్చుకుంటున్నారు. ఇలా లాక్ డౌన్ సమయంలో అనేకమంది సెలబ్రెటీలు ఇంట్లో క్లీనింగ్, కుకింగ్, గార్డెనింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు ఉంచి హల్ చల్ చేశారు. ఇప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు చేపల పులుసుతో రంగంలోకి దిగారు. ఫ్యామిలీ కోసం కొంత సమయం కేటాయించి చేపల పులుసు చేశానంటూ ఆయన సోషల్ మీడియాలో సదరు వీడియో పోస్ట్ చేశారు.
పశ్చిమ గోదావరిజిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు 80ఏళ్ల వయసులోనూ చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక విషయాల్లో యాక్టివ్ గా ఉంటూ తన వంతు కర్తవ్యాల్ని నిర్వర్తిస్తుండటం చూస్తున్నాం. 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఖాతాలో ‘తాండ్రపాపారాయుడు’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.
Took some time out to make chapala pulusu for the family today!? #weekendspecial pic.twitter.com/blb3z3mona
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) August 29, 2020