టి- సాట్ నెట్వర్క్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు..

|

Aug 31, 2020 | 1:18 PM

ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధమైందని టీ -సాట్ సిఈఓ శైలేష్ రెడ్డి తెలిపారు. టి- సాట్ నెట్వర్క్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు...

టి- సాట్ నెట్వర్క్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు..
Follow us on

రేపటి(సెప్టెంబర్ 01) నుంచి ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధమైందని టీ -సాట్ సిఈఓ శైలేష్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 01 నుంచి టి- సాట్ నెట్వర్క్‌లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. విద్యార్థులు డిజిటల్‌ విధానంలో పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించామన్నారు.

15 రోజులకు సంబంధించిన టైం టేబుల్‌ను ముందుగానే ఫిక్స్ చేశామన్నారు. షెడ్యూల్ టైమ్‌ వివరాలను వెబ్ సైట్ , యూట్యూబ్‌లో పెడుతున్నామని అన్నారు. మిస్ అయిన క్లాసులను కూడా టి సాట్ యూట్యూబ్ , వెబ్ సైట్‌లో మళ్ళీ చూడొచ్చని తెలిపారు. భవిష్యత్ మొత్తం ఆన్లైన్ పైన ఉన్న నేపథ్యలో పిల్లలకు ఇప్పుడే అవగాహన రావడం మంచి పరిణామమేనని టీ -సాట్ సిఈఓ శైలేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ వంటి ఛానళ్ల ద్వారా 3వ తరగతి నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పాఠాలు ప్రసారం మొదలు పెడుతున్నారు. అందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు నెలల విరామం తర్వాత స్కూళ్లకు వచ్చిన హెడ్‌మాస్టర్లు, టీచర్లు, గ్రామస్థుల భాగస్వామ్యంతో డిజిటల్‌ పాఠాల టైం టేబుల్‌ గురించి ఇంటింటికి వెళ్లి చెప్పడమేగాక గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం ఆన్‌లైన్‌ పాఠాలతో తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు దూరదర్శన్‌, టీ శాట్‌, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అవకాశం కల్పిస్తుంది. విద్యార్థుల సందేహాలను సైతం ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచేందుకు వారి మధ్య వారధిగా వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియేట్‌ చేశారు.