Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Repo Rate: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రెపో రేటు.. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?

RBI Repo Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది. దానిని రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఖరీదైన రుణాలను ఇస్తుంది. బ్యాంకులు రుణ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి..

RBI Repo Rate: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రెపో రేటు.. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 13, 2025 | 11:07 AM

సాధారణంగా వినియోగదారులకు బ్యాంకులు రకరకాల రుణాలు అందిస్తుంటాయి. రుణాలపై రకరకాల వడ్డీ రేట్లు ఉంటాయి. ఖాతాదారుని సిబిల్‌ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అయితే బ్యాంకులు వినియోగదారులకు అప్పు ఇచ్చినట్లే బ్యాంకులు కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి కూడా అప్పు తీసుకుంటుంది. వాటికి కూడా వడ్డీ ఉంటుంది. కొన్ని సమయాల్లో బ్యాంకుల వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉంటే ఆ డబ్బును ఆర్బీఐ వద్ద డిపాజిట్‌ చేస్తుంటుంది. ఇందు కోసం ఆర్బీఐ కొంత వడ్డీని చెల్లిస్తుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ అప్పుడప్పుడు నిర్వహించి సమావేశంలో వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. ఇటీవల దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ దేశంలోని కోట్లాది మందికి రుణ ఈఎంఐలలో ఉపశమనం కల్పించింది. . ఆర్బీఐ MPC వరుసగా రెండవసారి రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. ఆ తర్వాత రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది.

రెపో రేటు అంటే ఏమిటి?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందిస్తుంది. దానిని రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఖరీదైన రుణాలను ఇస్తుంది. బ్యాంకులు రుణ భారాన్ని ఖాతాదారులపై మోపుతాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణ రుణాలను తగ్గించేందుకు ఆర్‌బిఐ మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తుంది. ఇందుకోసం రెపో రేటును పెంచింది.

రివర్స్ రెపో రేటు:

ఆర్బీఐ ఈ రకమైన రివర్స్ రెపో రేటు కింద వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంది. అంటే ఈ బ్యాంకులు ఆర్బీఐ వద్ద డబ్బును డిపాజిట్ చేస్తాయి. ఆర్‌బీఐ దానిపై వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీరేట్లలో కూడా మార్పులు జరుగుతుంటాయి. రివర్స్ రెపో రేటు శాతాన్ని గ‌తంలో రెపో రేటు వ‌డ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో ఆర్బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు మారినప్పుడల్లా రివ‌ర్స్ రెపో రేటును దానికంటే 1 శాతం తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్