క‌రోనా సంక్షోభం : ఉద్యోగుల‌కు రేమండ్ ఉద్వాస‌న‌

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 3:27 PM

నాణ్యమైన సూట్లు తయారు చేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న‌ రేమండ్ లిమిటెడ్, కరోనావైరస్ వ్యాప్తి కార‌ణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది.

క‌రోనా సంక్షోభం : ఉద్యోగుల‌కు రేమండ్ ఉద్వాస‌న‌
Follow us on

Raymond is reducing jobs : నాణ్యమైన సూట్లు తయారు చేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న‌ రేమండ్ లిమిటెడ్, కరోనావైరస్ వ్యాప్తి కార‌ణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ప్రజలు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో సంస్థ త‌న‌ ఖర్చులను మూడో వంతుకు పైగా తగ్గించింది.  అంద‌రూ వ‌ర్క్ ఫ్ర‌మ్ చేస్తుండటం, రిస్క్ వంటి కార‌ణాల‌ వల్ల‌ సూట్లు, బిజినెస్ దుస్తులు ధ‌రించ‌డం మానేశారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి ముంబైకి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులు, అద్దెలు, మార్కెటింగ్ ఖర్చులను 35% తగ్గించుకుందని సంస్థ‌ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా గత వారం వర్చువల్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్ర‌స్తుత సంక్షోభ ప‌రిస్థితుల కార‌ణంగా సెంట్రల్ బ్యాంక్ అందించిన‌ వన్-టైమ్ రుణాల తిరిగి చెల్లించడాన్ని స్తంభింపచేయాలని కోరారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని తాము బ‌లంగా నిల‌బ‌డ‌తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభం అవ్వ‌డంతో రిటైల్ వ‌స్త్ర వ్యాపారం బాగా దెబ్బ‌తింది. 1925 లో అప్పటి బొంబాయి శివార్లలో ఒక చిన్న ఉన్ని మిల్లుగా ప్రారంభమైన రేమండ్, ఈ సంవత్సరం వైర‌స్ కార‌ణంగా తొలిసారి న‌ష్టాల‌ను చవిచూసింది. మార్చి 25 న భారత్ లాక్ డౌన్ ప్రారంభం అయింది. అప్ప‌ట్నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో దుకాణాలు మూత‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో రేమండ్ తన స్టోర్ ఓపెనింగ్స్, పునర్నిర్మాణాలు, సాంకేతిక నవీకరణలు వాయిదా వేసింది.

 

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు