Raviteja: జనం వస్తారనుకున్నాం కానీ… మరీ ఇంతలా వస్తారనుకోలేదు.. మంచి కిక్‌ ఇచ్చారు.. క్రాక్‌ విజయంపై..

Raviteja In Krack Sucess Meet: మాస్‌ మహారాజాకు కచ్చితంగా విజయం అవసరమైన సందర్భంలో వచ్చిన చిత్రమే 'క్రాక్‌'. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై...

Raviteja: జనం వస్తారనుకున్నాం కానీ... మరీ ఇంతలా వస్తారనుకోలేదు.. మంచి కిక్‌ ఇచ్చారు.. క్రాక్‌ విజయంపై..

Edited By:

Updated on: Jan 14, 2021 | 9:10 AM

Raviteja In Krack Sucess Meet: మాస్‌ మహారాజాకు కచ్చితంగా విజయం అవసరమైన సందర్భంలో వచ్చిన చిత్రమే ‘క్రాక్‌’. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా క్రాక్‌ రికార్డు సృష్టించింది. ఇక రవితేజ నటన, తమన్‌ మ్యూజిక్‌, గోపిచంద్‌ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తోన్న క్రాక్‌ విజయోత్సవ సభను బుధవారం చిత్రయూనిట్‌ విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో రవితేజ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞత తెలిపాడు. ఈ సందర్భంగా మాస్‌ మహారాజా మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత సినిమా చూడడానికి ప్రేక్షకులు కచ్చితంగా వస్తారని అనుకున్నాం. కానీ మరీ ఈ స్థాయిలో వస్తారని అస్సలు అనుకోలేదు. మంచి కిక్‌ ఇచ్చారు. గతంలో వచ్చినట్లే ఇప్పుడూ థియేటర్లకు వస్తున్నారు. ఈ చిత్రానికి థమన్‌ మంచి సంగీతాన్ని అందించాడు. ఇక కెమెరామెన్‌ విష్ణు అద్భుతంగా పనిచేశాడు. విష్ణుతో మళ్లీ పనిచేయాలని ఉంది. సాధారణంగా వరలక్ష్మీ ఎక్కువగా సీరియస్‌ పాత్రల్లో నటిస్తుంది కానీ.. సెట్‌లో మాత్రం అందరినీ ఎంతో నవ్విస్తుంది’ అని చెప్పుకొచ్చాడు రవితేజ.

Also Read: Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..