నానికి నో చెప్పిన రష్మిక… కారణమిదేనా.?

|

Jun 24, 2020 | 3:41 PM

వరుస సినిమాలతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా.. తాజాగా ‘భీష్మ’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ కస్తూరి నేచురల్ స్టార్ నాని సినిమాకు నో చెప్పిందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. నాని ప్రధానపాత్రలో తెరకెక్కనున్న ‘శ్యాం సింగరాయ్’ చిత్రంలోని ఫిమేల్ లీడ్ కోసం రష్మిక మందన్నాను సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. సినిమాలో తనది మెయిన్ […]

నానికి నో చెప్పిన రష్మిక... కారణమిదేనా.?
Follow us on

వరుస సినిమాలతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా.. తాజాగా ‘భీష్మ’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ కస్తూరి నేచురల్ స్టార్ నాని సినిమాకు నో చెప్పిందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. నాని ప్రధానపాత్రలో తెరకెక్కనున్న ‘శ్యాం సింగరాయ్’ చిత్రంలోని ఫిమేల్ లీడ్ కోసం రష్మిక మందన్నాను సంప్రదించిందట చిత్ర యూనిట్.

అయితే రష్మిక మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. సినిమాలో తనది మెయిన్ లీడ్ కాకపోవడం, అంతేకాకుండా సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెప్పడం వంటి కారణాల వల్ల రష్మిక ‘శ్యాం సింగరాయ్’లో నటించేందుకు విముఖత చూపించిందని టాక్ నడుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మరో ఇద్దరి హీరోయిన్లు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. కాగా, నాని నటించిన ‘వి’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తోన్న ‘టక్ జగదీశ్’ షూటింగ్ చివరి దశలో ఉంది.