ఓడిన వ్యక్తులు గెలిచినవాళ్లను ఎలా అభినందిస్తారు..?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూంటాడు. ఢిఫరెంట్ సినిమాలు తీయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం జరిగే పరిస్థితులకనుణుగుణంగా సినిమాలు తీస్తూంటారు. తాజాగా.. ఓడిన వ్యక్తులు, గెలిచిన వాళ్లకు ఎలా శుభాకాంక్షలు చెప్తారంటూ..? తన ట్విట్టర్‌ అకౌంట్‌‌లో ఓ సరికొత్త ట్వీట్ చేశాడు. సాధారణంగా రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినవాళ్లను ఓడినవాళ్లు అభినందిస్తూంటారు. కానీ ఇది తప్పట, చాలా షేమ్‌లెస్ అని వర్మ అంటున్నారు. ‘ఓడిన వ్యక్తులు […]

ఓడిన వ్యక్తులు గెలిచినవాళ్లను ఎలా అభినందిస్తారు..?

Edited By:

Updated on: May 25, 2019 | 3:17 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూంటాడు. ఢిఫరెంట్ సినిమాలు తీయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం జరిగే పరిస్థితులకనుణుగుణంగా సినిమాలు తీస్తూంటారు. తాజాగా.. ఓడిన వ్యక్తులు, గెలిచిన వాళ్లకు ఎలా శుభాకాంక్షలు చెప్తారంటూ..? తన ట్విట్టర్‌ అకౌంట్‌‌లో ఓ సరికొత్త ట్వీట్ చేశాడు.

సాధారణంగా రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినవాళ్లను ఓడినవాళ్లు అభినందిస్తూంటారు. కానీ ఇది తప్పట, చాలా షేమ్‌లెస్ అని వర్మ అంటున్నారు. ‘ఓడిన వ్యక్తులు గెలిచిన వాళ్లను అభినందించడం ఏంటి ఏంటి? ఓడిపోయినందుకు బాధ పడాలి.. లేదంటే కోపం ఉండాలి. కానీ.. ఇలా శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వర్మ కాబట్టే ఇలాంటి ఆలోచనలు వస్తాయని, ఇలా ప్రశ్నిస్తారని అంటున్నారు.