మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. గర్భగుడి వద్ద వెండితో

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

Edited By:

Updated on: Aug 05, 2020 | 10:46 AM

Ram temple: అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనుండగా.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. గర్భగుడి వద్ద వెండితో పైకప్పును ఏర్పాటు చేయనుండగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలవనుంది. ప్రస్తుతం కంబోడియాలోని అంగోకర్‌వాట్ టెంపుల్ తొలి స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది.

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇంటిముందు రంగవల్లులతో, విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. రామ భక్తులు, అఖాడాల సాధువులు రాముడి పాటలతో తన్మయత్వంతో మునిగితేలుతున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మూడున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నారు. కొత్త ఆలయం వెడల్పు 140 అడుగుల నుండి 270- 280 అడుగులకు, పొడవు 268 నుండి 280-300 అడుగులకు, ఎత్తు 128 అడుగుల నుండి 161 అడుగులకు పెరిగే అవకాశం ఉంది.  అయోధ్య రామాలయ నిర్మాణాన్ని మూడున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు రామయ్యను దర్శించుకునేలా, ఆలయ ప్రాంగణంలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా రూపకల్పన చేయనున్నారు.