Ram Charan : రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన మెగా పవర్ స్టార్.. డే అండ్ నైట్ షూట్స్ లో పాల్గొంటున్న చరణ్.

|

Jan 20, 2021 | 11:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు చరణ్...

Ram Charan : రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన మెగా పవర్ స్టార్.. డే అండ్ నైట్ షూట్స్ లో పాల్గొంటున్న చరణ్.
Follow us on

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ మూవీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇటీవలే ఆచార్య సెట్ లో చరణ్ జాయిన్ అయ్యాడని కొరటాల శివ పోస్టర్ రిలీజ్ చేసి మరి అనౌన్స్ చేశారు.  ఈ పోస్ట్ వచ్చిన వెంటనే ఆర్ ఆర్ ఆర్ లో రామరాజు భీమ్ తో క్లైమాక్స్ తెరకెక్కిస్తున్న అంటూ జక్కన అనౌన్స్ చేసాడు. ఇలా వరుస షూట్ లతో చరణ్ చాలా బిజీ అయిపోయాడు.  ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్  ను చేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఒక సినిమా షూటింగ్ డే టైం లో జరుగుతుండగా మరో సినిమా షూటింగ్ నైట్ టైం జరుగుతుందట.. దాంతో చరణ్ డే అండ్ నైట్ షూట్ తో బిజీ బిజీగా ఉన్నాడని అంటున్నారు. ఆచార్య సినిమా లో చరణ్ కీలక పాత్ర కాబట్టి మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఆతర్వాత పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ పైన దృష్టి పెట్టనున్నాడని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

తెలుగులో ‘పొగరు’తో ఎంట్రీ ఇవ్వనున్న ధృవ సర్జా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..