రాజస్థాన్‌పై భానుడి ప్రతాపం

| Edited By:

Jun 02, 2019 | 7:52 AM

దేశవ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శనివారం రాజస్థాన్‌లో భానుడు తన ఉగ్రరూపాన్ని దాల్చాడు. ఆ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. చురూలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది అక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే తొమ్మిది డిగ్రీలు అధికం. గంగానగర్‌లో 49 డిగ్రీలు, బికనేర్‌లో 48 డిగ్రీలు, జైసల్మేర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ కలర్ […]

రాజస్థాన్‌పై భానుడి ప్రతాపం
Follow us on

దేశవ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శనివారం రాజస్థాన్‌లో భానుడు తన ఉగ్రరూపాన్ని దాల్చాడు. ఆ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. చురూలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది అక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే తొమ్మిది డిగ్రీలు అధికం.

గంగానగర్‌లో 49 డిగ్రీలు, బికనేర్‌లో 48 డిగ్రీలు, జైసల్మేర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ కలర్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని బండా ప్రాంతంలో అత్యధికంగా 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్, విదర్భ, మధ్యప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజులు, పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.