రాజస్తాన్ లో ఇక మాస్క్ లు తప్పనిసరి, చట్టం తెస్తాం, సీఎం అశోక్ గెహ్లాట్

| Edited By: Anil kumar poka

Nov 02, 2020 | 12:19 PM

రాజస్తాన్ లో మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తూ సోమవారం నుంచే చట్టం తెస్తున్నామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

రాజస్తాన్ లో ఇక మాస్క్ లు తప్పనిసరి, చట్టం తెస్తాం, సీఎం అశోక్ గెహ్లాట్
Follow us on

రాజస్తాన్ లో మాస్కుల ధారణను తప్పనిసరి చేస్తూ సోమవారం నుంచే చట్టం తెస్తున్నామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కోవిడ్ 19 పై పోరుకు దేశంలో ఈ విధమైన చట్టం తేవడంలో తమదే మొట్టమొదటి రాష్ట్రమని ఆయన చెప్పారు. ‘మాస్క్ ఈజ్ ది వ్యాక్సీన్’ అని ఆయన అభివర్ణించారు. కరోనా వైరస్ పై పోరాటానికి ప్రజా ఉద్యమం ఇప్పటికే మొదలైందని, ఇదే సమయంలో  మాస్క్ లను నిర్బంధం చేస్తూ చట్టం తెస్తున్నామని ఆయన అన్నారు. రాజస్తాన్ లో నిన్న ఒక్కరోజే 10 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 1,917 కి పెరిగింది. కొత్తగా 1754 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య 1,98,747 కి పెరిగింది. అటు- కోవిడ్ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలను, వాటిని కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పెళ్లిళ్లు వంటి శుభ కార్యాల సమయంలో కూడా బాణాసంచా కాల్చరాదని ఉత్తర్వులు జారీ చేసింది.