కొనసాగుతున్న కరోనా కరాళనృత్యం.. కొవిడ్ బారినపడి రాజస్థాన్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత

|

Nov 30, 2020 | 11:33 AM

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరిని కబళిస్తోంది. తాజాగా కరోనా వైరస్‌ రాకాసి కోరలకు మరో బీజేపీ ఎమ్మెల్యే బలయ్యారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు.

కొనసాగుతున్న కరోనా కరాళనృత్యం.. కొవిడ్ బారినపడి రాజస్థాన్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత
Follow us on

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరిని కబళిస్తోంది. తాజాగా కరోనా వైరస్‌ రాకాసి కోరలకు మరో బీజేపీ ఎమ్మెల్యే బలయ్యారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు. బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె అర్దరాత్రి ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

కిరణ్ మహేశ్వరి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్ పూర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.