AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాను కూడా భయపెడుతోన్న పండుగల సీజన్‌

కరోనా వైరస్‌ అమెరికాలాంటి అగ్రరాజ్యాన్నే అతలాకుతలం చేస్తోంది.. ఆ వైరస్‌ను నియంత్రించలేక అమెరికా ఏనాడో చేతులెత్తేసింది. సెకండ్‌ వేవో, థర్డ్‌ వేవో తెలియదు కానీ అమెరికాలో మాత్రం కేసులు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి..

అమెరికాను కూడా భయపెడుతోన్న పండుగల సీజన్‌
Balu
|

Updated on: Nov 30, 2020 | 11:16 AM

Share

కరోనా వైరస్‌ అమెరికాలాంటి అగ్రరాజ్యాన్నే అతలాకుతలం చేస్తోంది.. ఆ వైరస్‌ను నియంత్రించలేక అమెరికా ఏనాడో చేతులెత్తేసింది. సెకండ్‌ వేవో, థర్డ్‌ వేవో తెలియదు కానీ అమెరికాలో మాత్రం కేసులు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి.. రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.. అందుకు కారణం పండుగలే! ఓనం పండుగ తర్వాత కేరళలో కేసులు ఎలా పెరిగాయో మనకు అనుభవమే. మరికొద్ది రోజుల్లో క్రిస్‌మస్‌, థాంక్స్‌ గివింగ్‌ వేడుకలు జరగబోతున్నాయి.. ఈ రెండింటినీ సామూహికంగా జరుపుకుంటారు ప్రజలు.. కుటుంబసభ్యులే కాదు, బంధుమిత్రులు కూడా సమావేశమవుతారు.. ఈ పండుగల రత్వాత కేసులు భారీగా పెరుగుతాయని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంటున్నారు.. థాంక్స్‌ గివంగ్‌ ఉత్సవం తర్వాత కేసులు బాగా పెరుగుతాయని అంచనా వేశారాయన! పండుగ సీజన్‌ కాబట్టి సమావేశాలు ఎక్కువగా ఉంటాయని, కరోనా వ్యాప్తి తీవ్రతకు ఇది కారణమవుతుందని చెప్పారు. కరోనాను సమర్థంగా నియంత్రించిన దేశాలలో కూడా ఇప్పుడు వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న సంగతిని విస్మరించకూడదని సూచించారు. ఎంత కాదన్నా కరోనాకు వ్యాక్సిన్‌ రావడానికి రెండు మూడు నెలలు పడుతుందని, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని సలహా ఇచ్చారు ఫౌచి. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య కోటి 30 లక్షలు దాటింది. 2,65,000 మంది కరోనాతో చనిపోయారు.

Follow Us
సరదాగా బీచ్‌కు వెళ్లిన జనం.. తీరంలో కనిపించిన వింత జీవి..
సరదాగా బీచ్‌కు వెళ్లిన జనం.. తీరంలో కనిపించిన వింత జీవి..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..
మెడికల్ మిరకిల్‌ : అవయవ మార్పిడి అవసరం లేని ప్రయోగం
మెడికల్ మిరకిల్‌ : అవయవ మార్పిడి అవసరం లేని ప్రయోగం