తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్...

తెలంగాణలో భారీ వర్షాలు..

Updated on: Jul 31, 2020 | 9:51 PM

Rains Predicted Three Days in Telangana : తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. శ‌ని, ఆదివారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 4న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.