వయనాడ్‌లో రోడ్డు పక్కన ‘టీ’ తాగిన రాహుల్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి 4లక్షల మెజార్టీతో విజయం సాధించిన రాహుల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మలిప్పురం జిల్లాలోని కాలికవుకు చేరుకున్న ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వయనాడ్ వీధుల గుండా ఓపెన్ ట్రాలీ నుంచి బయలుదేరారు. తొలిరోజు మలప్పురంలోని చొక్కాడ్‌లో పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న […]

వయనాడ్‌లో రోడ్డు పక్కన 'టీ' తాగిన రాహుల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2019 | 10:03 PM

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి 4లక్షల మెజార్టీతో విజయం సాధించిన రాహుల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మలిప్పురం జిల్లాలోని కాలికవుకు చేరుకున్న ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వయనాడ్ వీధుల గుండా ఓపెన్ ట్రాలీ నుంచి బయలుదేరారు. తొలిరోజు మలప్పురంలోని చొక్కాడ్‌లో పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న టీ దుకాణం వద్ద రాహుల్ కొద్దిసేపు ఆగి టీ, స్వల్ప ఆహారానికి ఆర్డర్ చేశారు. రాహుల్ తన దుకాణానికి విచ్చేయడంతో ఆ దుకాణం యజమానితో పాటు కస్టమర్లు సైతం ఆశ్యర్యపోయారు. రాహుల్ టీ తాగుతూ అక్కడున్న వారిని పలుకరించారు.

వయనాడ్‌ నుంచి రాహుల్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుని సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద విజయం పార్టీకి కట్టబెట్టిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకు రాహుల్ మూడు రోజుల పర్యటన చేపట్టారు. వయనాడ్, కోజికోడ్ జిల్లాలతో పాటు మలప్పురంలోనూ రాహుల్ రోడ్‌షోల్లో పాల్గోనున్నారు.