కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి, ఏపీకి వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా దక్షిణ తీరప్రాంతాన్ని అనుకుని ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి, ఏపీకి వర్ష సూచన
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2020 | 8:11 AM

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా దక్షిణ తీరప్రాంతాన్ని అనుకుని ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురువనున్నట్లు వెల్లడించింది. కాగా అక్టోబరు 9వ తేదీ నాటికి అండమాన్ తీరానికి దగ్గరగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ క్రమంగా కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖ, విజయనగరం, దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. (రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )

రాష్ట్రంలోని వివధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు

  • గన్నవరం -6.1 సె.మీ
  • పొన్నూరు 3.8 సె.మీ
  • గోపాలపురం 3.6 సె.మీ
  • విజయనగరం 3.1 సె.మీ
  • విశాఖపట్నం 2.7 సె.మీ
  • భీమడోలు 2.5 సె.మీ
  • రాజమహేంద్రవరం 2.3 సె.మీ
  • కొవ్వూరు 1.8 సె.మీ
  • వీరఘట్టం 1.3 సె.మీ