చురుగ్గా రుతుపవనాలు.. మరో రెండు రోజలపాటు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫానుగా మారకముందే తీరం దాటింది. ఒడిశాలోని బాలాసోర్ దగ్గర తీరం దాటడంతో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుంది. దీంతో.. తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత పదిరోజుల నుంచి.. హైదరాబాద్ జంట నగరాలలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా.. ఆదివారం వరకూ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ […]
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫానుగా మారకముందే తీరం దాటింది. ఒడిశాలోని బాలాసోర్ దగ్గర తీరం దాటడంతో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడనుంది. దీంతో.. తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత పదిరోజుల నుంచి.. హైదరాబాద్ జంట నగరాలలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా.. ఆదివారం వరకూ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.