వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను ఎంపీగా గెలిచిన కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జూన్ 7 నుంచి రెండ్రోజుల పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే 24న ట్విటర్ ద్వారా రాహుల్ వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ లోక్‌సభ స్థానంలో రాహుల్‌కు […]
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను ఎంపీగా గెలిచిన కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జూన్ 7 నుంచి రెండ్రోజుల పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే 24న ట్విటర్ ద్వారా రాహుల్ వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ లోక్‌సభ స్థానంలో రాహుల్‌కు 7,05,034 ఓట్లు పోలవ్వగా.. 4,31,063 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) నుంచి పీపీ సునీర్ పోటీశారు.