తీహార్‌ జైలుకు రాహుల్‌, ప్రియాంక..ఎందుకంటే

తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక. మనీలాండరింగ్‌ కేసులో ఆయనకున్నజ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారించనుంది ఉన్నత న్యాయస్థానం. నవంబర్‌ 15న ఢిల్లీ హైకోర్ట్‌ బెయిల్‌ నిరాకరించడంతో దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు చిదంబరం. ఈ  పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినిపించనున్నారు ఇరు వర్గాల లాయర్లు. షెల్‌ కంపెనీలు, విదేశీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు […]

తీహార్‌ జైలుకు రాహుల్‌, ప్రియాంక..ఎందుకంటే

Edited By:

Updated on: Nov 27, 2019 | 6:31 PM

తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక. మనీలాండరింగ్‌ కేసులో ఆయనకున్నజ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. ఈ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారించనుంది ఉన్నత న్యాయస్థానం. నవంబర్‌ 15న ఢిల్లీ హైకోర్ట్‌ బెయిల్‌ నిరాకరించడంతో దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు చిదంబరం. ఈ  పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినిపించనున్నారు ఇరు వర్గాల లాయర్లు.
షెల్‌ కంపెనీలు, విదేశీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది ఈడీ. మాజీ కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం చాలా తెలివైన వ్యక్తి అని..ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పేర్కొంది. ఈ కేసులో అక్టోబర్ 16న చిదంబరాన్ని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆగస్ట్‌ 21న అరెస్ట్‌ చేయగా..అక్టోబర్‌ 22న బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీంకోర్ట్‌. మరోవైపు నిన్న కాంగ్రెస్ నాయకులు శశి థరూర్, మనీష్ తివారీ కూడా జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రిని కలిసి తమ సంఘీభావం తెలిపారు.