రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

|

Nov 08, 2020 | 3:22 PM

ప్రముఖ హీరోయిన్ రాయ్‌ లక్ష్మీ ఇంటి విషాదం చోటుచేసకుంది. ఆమె తండ్రి రామ్‌ రాయ్‌ కన్నుమూశారు.  ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి. 

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్
Follow us on

ప్రముఖ హీరోయిన్ రాయ్‌ లక్ష్మీ ఇంటి విషాదం చోటుచేసకుంది. ఆమె తండ్రి రామ్‌ రాయ్‌ కన్నుమూశారు.  ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి.  తన నాన్నను బతికించుకోలేకపోయానంటూ ఆమె సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. తన కన్నతండ్రి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలతో ఓ ఎమోషనల్ ట్వీట్​ చేసింది.

“డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను దాటి వెళ్లలేను. మిమ్మల్ని బతికించుకోలేకపోయాను. ఈ లోటుతోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మా నాన్న ఇకలేరని చెబుతుంటే.. నా హృదయం ముక్కలు అవుతోంది.  మీరు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను.. కానీ రక్షించుకోలేకపోయినందుకు క్షమించండి. అంతా సక్రమంగా జరుగుతుందని చెప్పడానికి పక్కనే మీరు ఉంటే బాగుండేదని నా మనసు చెబుతోంది. నేను మీ కుమార్తెను కావడం నా అదృష్టం. నేనెప్పుడూ స్వేచ్ఛగా, దృఢంగా ఉండాలని మీరు ఎందుకు చెప్పేవారో అర్థమైంది. ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను తట్టుకోవాలని అలా చెప్పేవారు. ఇప్పుడు మీరు.. నొప్పి, బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారని నాకు తెలుసు. దీన్ని నా మనసుకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నా. మీరు పై నుంచి నన్ను దీవిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు. మీరు నన్ను నమ్మారు. మీరు కోరిన కోర్కెను మీ చిన్నారి కూతురు తప్పకుండా నెరవేరుస్తుంది.  బంగారం లాంటి మనసున్న వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆపేసింది. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మేం ఎంతో మిస్‌ అవుతున్నాం. ఐ లవ్‌ యూ” అంటూ రాయ్ లక్ష్మి పెట్టిన ట్వీట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి