AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రహస్యాల నిలయం… పూరీ జగన్నాథ స్వామి ఆలయం!

పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60కిమీ దూరంలో ఉంది. ఇక్కడ పూరీ జగన్నాథుడు సోదరీ సోదర సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. పూరీ జగన్నాథ్ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటీ మిస్టరీయే. అందుకే పూరీ […]

రహస్యాల నిలయం... పూరీ జగన్నాథ స్వామి ఆలయం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 4:23 PM

Share

పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60కిమీ దూరంలో ఉంది. ఇక్కడ పూరీ జగన్నాథుడు సోదరీ సోదర సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. పూరీ జగన్నాథ్ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటీ మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. వివరాల్లోకెళితే…

65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం

ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు..అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొసుకొస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతీదానికీ ఒక విశిష్టత కలిగి ఉంది.

జెండా

పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే..గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. . కానీ ..ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా, వ్యతిరేక దిశలో ఊగుతుంది.

చక్రం

పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందన్న విషయం అందిరికీ తెలిసందే. ఆ గోపురంపైన ఓ సుందర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ నుండి అయినా ఈ సుదర్శన చక్రాన్ని చూడవచ్చు. మీరు ఎక్కడి నుండి చూసిన ఈ సుదర్శన చక్రం మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.

పక్షులు

పూరీ జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయంపైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు..అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం. ఎంతో మంది పరిశోధకలు దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.

గోపురం నీడ

పూరీ జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా..సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపంచదు. దీని నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమే.

అలలు

సాధారణంగా అన్ని ఎక్కడైనా గాలి దిశ సముద్రం నుండి భూమివైపుకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమివైపు నుండి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ..పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.

ప్రసాదం

పూరీ జగన్నాథుని  ఆలయంలో తయారుచేసిన ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట. కొంచెం కూడా వేస్ట్ చేయ్యరు. తక్కువా కాదు. మొత్తం తినేస్తారు. ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారుచేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట, ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేధించిన తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట.

రథ యాత్ర

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. ఈ రథ యాత్రలో రెండు రథాలుంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుండి మరో రథంలో దేవుళ్ళను గుండిజా ఆలయానికి తీసుకెళతారు. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి.

రథాలు

పూరీ వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే… జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

బంగారు చీపురు

రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను ముందు ఊడ్చుటారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.

విగ్రహాలు

ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.

గుండిజా ఆలయం

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే..గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే..రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు.ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది.

దేవుడి ప్రసాదం

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు. ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆతరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా, అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ఆ ప్రసాదాలు.

అలల శబ్దం

పూరీ జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రమున్నది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడిలోపలికి పెట్టగానే..సముద్రంలో నుండి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.

ఎలా వెళ్ళాలి 

ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 44 కి.మీ. దూరంలో పూరి పట్టణం ఉంది. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.