బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులను తనదైన దూకుడుతో ఆకట్టుకున్న కంటెస్టెంట్ పునర్నవి. మొదట హాట్ హాట్ డ్రెస్సులతో కాక పుట్టించినా.. ఆ తర్వాత క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షించింది. కానీ ప్రస్తుతం ఆమెపై వ్యతిరేకత ఎక్కువైందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
షో ఆరంభంలో ఎక్కువగా నామినేషన్స్ నుంచి బయటపడినా.. ముందొక మాట వెనకొక మాట అన్న తీరుతో తనకు తానే ఎలిమినేషన్స్ ఎదుర్కుంటోంది. ఆమె ప్రవర్తన వల్లే ఇదంతా జరుగుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల రవికృష్ణను తిట్టడం.. అంతేకాక రాహుల్‌ను కూడా అదే పనిగా దుయ్యబట్టడం ఆమెపై వ్యతిరేకతను పెంచుతూ వచ్చింది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బిగ్ బాస్ 3పై కూడా మండిపడుతున్నారు. రాహుల్‌తో సాగుతున్న లవ్ ట్రాక్ కోసమే పునర్నవిని ఇన్నాళ్లు సేవ్ చేస్తూ వచ్చారని.. వాస్తవానికి రమ్యకృష్ణ హోస్టుగా వ్యవహరించిన ఎపిసోడ్‌తోనే పున్ను ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ ఆ వారం కావాలనే ఎలిమినేషన్‌ను రద్దు చేశారని తిట్టిపోస్తున్నారు.
పునర్నవి మనిషి ఎదురుగా లేనప్పుడు ఒక మాట.. వారి వెనక ఒక మాట చెబుతుందన్న నెటిజన్ల వ్యాఖ్యలు ఏరోజుకా రోజు పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాక వరుణ్, వితిక, రాహుల్ గ్రూప్‌తో ఉండటం వల్ల ఎక్కువ సేవ్ అవుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆమె చేసే కామెంట్స్, ప్రవర్తనకు నెట్టింట్లో తెగ విమర్శలు ఎదురవుతున్నాయి. అంతేకాక ఈవారం ఎలిమినేషన్స్‌లో ఆమెకే తక్కువ ఓటింగ్ శాతం నమోదైందని ఇన్‌సైడ్ టాక్. పునర్నవి అనధికారికంగా బయటికి వచ్చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అటు మహేష్ విట్టా కూడా ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.