ఆ రాష్ట్రంలో.. ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేష‌న్‌..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలంతా

ఆ రాష్ట్రంలో.. ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేష‌న్‌..!

Edited By:

Updated on: Jul 26, 2020 | 7:05 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేషన్‌లో ఉండాల‌ని సీఎం వి నారాయ‌ణ స్వామి తెలిపారు. సోమ‌వారం అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అసెంబ్లీ చివ‌రి రోజున ఆయ‌న చెప్పారు. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుద్దుచ్చేరిలో సోమ‌వారం నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపు (సోమవారం) అందరు ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. శ‌నివారం అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆరుబ‌య‌ట నిర్వ‌హించారు. బ‌డ్జెట్‌పై చ‌ర్చ అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో బ‌డ్జెట్ స‌మావేశాలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంపై స్పీక‌ర్ శివ‌కొలుందును లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ ప్ర‌శంసించారు.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..