నెలరోజులుగా ఔటర్ రింగ్ లింక్ రోడ్ బంద్.. వాహనదారులు ఆగ్రహం

ఔటర్ రింగ్ ఎక్కిదిగేందుకు వీలైన లింక్ రోడ్ దారి బంద్ అయినప్పటికీ పట్టించుకునే వాళ్లే కరువయ్యారని హైదరాబాద్ నగరవాసులు వాపోతున్నారు. గతనెల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్గొండ వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎక్కేందుకు దిగేందుకు వీలు లేకుండా వర్షపు నీరు వచ్చి చేరింది. శంషాబాద్ లో ఔటర్ రింగ్ ఎక్కి మహేశ్వరం వెళ్లాలంటే పెద్దగోల్గొండ దగ్గర దిగాలి. కానీ అక్కడ వర్షపు నీరు నిండడంతో వీలు లేక గేట్ ముసివేశారు. […]

నెలరోజులుగా ఔటర్ రింగ్ లింక్ రోడ్ బంద్.. వాహనదారులు ఆగ్రహం
Follow us

|

Updated on: Nov 11, 2020 | 12:55 PM

ఔటర్ రింగ్ ఎక్కిదిగేందుకు వీలైన లింక్ రోడ్ దారి బంద్ అయినప్పటికీ పట్టించుకునే వాళ్లే కరువయ్యారని హైదరాబాద్ నగరవాసులు వాపోతున్నారు. గతనెల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్గొండ వద్ద ఔటర్ రింగు రోడ్డు ఎక్కేందుకు దిగేందుకు వీలు లేకుండా వర్షపు నీరు వచ్చి చేరింది. శంషాబాద్ లో ఔటర్ రింగ్ ఎక్కి మహేశ్వరం వెళ్లాలంటే పెద్దగోల్గొండ దగ్గర దిగాలి. కానీ అక్కడ వర్షపు నీరు నిండడంతో వీలు లేక గేట్ ముసివేశారు. దీంతో వాహనదారులు 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి తుక్కుగూడ వద్ద దిగి వెళ్లాల్సి వస్తోంది. పెద్దగోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉండే వారు అక్కడ ఔటర్ రింగ్ ఎక్కేవారు శంషాబాద్ కు వచ్చి ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు మూతపడి దాదాపు నెలరోజులు కావస్తున్నా పట్టించుకోకుండా అధికారులు నిమ్మకున్నారని వాహనదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.