PSPK 27 Movie: ‘మిస్టర్ మజ్ను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘ఓ డియర్’ మూవీలో నటిస్తున్న ఆమె తాజాగా బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ చిత్రాన్ని తెరకెక్కించున్న సంగతి తెలిసిందే.
Also Read: Vijay Sethupathi Counter Over IT Raids On Vijay
ఇందులో పవన్ కళ్యాణ్ ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కైరా అద్వానీ, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా చివరికి నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.
Also Read: Ala Vaikuntapuram Set To Be Remade In Hindi