ఢిల్లీలో 26వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన.. బ్రిటన్ ప్రధాని భారత్ రావద్దంటూ లేఖ రాస్తామన్న రైతు సంఘాలు

|

Dec 22, 2020 | 9:20 PM

కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతుల ఆందోళన 26వ రోజుకు చేరుకుంది. మరోవైపు రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసింది. లేఖపై స్పందించిన రైతు సంఘాలు బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.

ఢిల్లీలో 26వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన.. బ్రిటన్ ప్రధాని భారత్ రావద్దంటూ లేఖ రాస్తామన్న రైతు సంఘాలు
Follow us on

కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతుల ఆందోళన 26వ రోజుకు చేరుకుంది. మరోవైపు రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసింది. లేఖపై స్పందించిన రైతు సంఘాలు బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.. చర్చలకు హాజరుకు సంబంధించి రేపు రైతు సంఘాలతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, కేంద్రం రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేవని.. ఇకముందు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

ఇదిలావుంటే, వచ్చే ఏడాది రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న భారత్‌కు వస్తున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావద్దని రైతు సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు ప్రధానిని ఇండియాకు రానివ్వండా చూడాలంటూ బ్రిటన్‌ ఎంపీలకు లేఖలు రాయాలని నిర్ణయించామని వారు తెలిపారు. రైతుల డిమాండ్లను కేంద్రం ఒప్పుకునే వరకు భారత్‌ పర్యటనకు రద్దు చేసుకోవాలని లేఖ పంపుతామని రైతు సంఘాలనేతలు హెచ్చరించారు. కొత్త వ్యసాయ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని మరోసారి రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతుల మద్దతు లభిస్తుందని, వేలాదిగా అన్నదాతలు దేశరాజధాని ఢిల్లీ చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.