ఉప్పులో దాచితే..మృతులు బతికొస్తారా?

ముంబై : జలగాన్‌లో ఓ మూఢ నమ్మకాలకు సంబంధించిన ఘటన కలకలం సృష్టించింది.  ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చనిపోయిన ఇద్దరు టీనేజర్లను బ్రతికించటానికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు విసృతంగా వ్యాపించాయి. యువకుల శవాలను పూర్తిగా ఉప్పులో దాచిపెట్టి ఉంచిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వివరణ కోరుతూ.. జలగాన్‌ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌కు పోలీసులు లేఖ రాశారు. స్థానికంగా మాస్టర్‌ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు […]

ఉప్పులో దాచితే..మృతులు బతికొస్తారా?
Bodies of Teens Kept in Rock Salt

Updated on: Aug 19, 2019 | 1:33 PM

ముంబై : జలగాన్‌లో ఓ మూఢ నమ్మకాలకు సంబంధించిన ఘటన కలకలం సృష్టించింది.  ఓ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో చనిపోయిన ఇద్దరు టీనేజర్లను బ్రతికించటానికి ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు విసృతంగా వ్యాపించాయి. యువకుల శవాలను పూర్తిగా ఉప్పులో దాచిపెట్టి ఉంచిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వివరణ కోరుతూ.. జలగాన్‌ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌కు పోలీసులు లేఖ రాశారు.

స్థానికంగా మాస్టర్‌ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం నీటిలో మునిగి చనిపోయారు. అదే రోజు వారి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం జలగాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఇటువంటి సంఘటన చోటుచేసుకుందన్న వార్తలతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.