
Priya Prakash Turns As Singer: ఒక చిన్న సన్నివేశంతో యావత్ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. కన్ను కొట్టిన సీన్‌తో ఒక్క రోజులోనే క్రేజీ క్రేజీ స్టార్‌గా మారిందీ బ్యూటీ. ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రియా ప్రకాశ్ అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.
మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ నటించే అవకాశం దక్కించుకుంటూ దూసుకుపోతున్న ప్రియా.. తన గొంతుతోనూ మ్యాజిక్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం, కన్నడ భాషల్లో ప్రియా పలు పాటలు పాడి ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ గొంతు సవరించుకోవడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో రానున్న ఓ ప్రైవేటు ఆల్బమ్ కోసం ప్రియా పాట పాడనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రియా ప్రస్తుతం.. తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘చెక్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.