యూపీలో మరో 43 మంది ఖైదీలకు కరోనా

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. రోజూ అత్యధిక సంఖ్య‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలకే పరిమితమైన వైరస్ జైళ్ల‌లోని ఖైదీల్లోని ఖైదీలను సైతం వదలడంలేదు.

యూపీలో మరో 43 మంది ఖైదీలకు కరోనా

Updated on: Sep 08, 2020 | 6:50 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. రోజూ అత్యధిక సంఖ్య‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలకే పరిమితమైన వైరస్ జైళ్ల‌లోని ఖైదీల్లోని ఖైదీలను సైతం వదలడంలేదు. తాజాగా ముజఫర్‌న‌గర్ జిల్లాలోని రెండు జైళ్ల‌లో 43 మంది ఖైదీలకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించారు జైలు సిబ్బంది. దీంతో వారంద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో వారిని వెంట‌నే జైలు కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో క‌లిపి జిల్లా జైళ్ల‌ల్లో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 400కు చేరింది. మరోవైపు ప్రతిరోజు జైళ్లను శానిటైజ్ చేస్తున్నామని ఖైదీలను కూడా భౌతికదూరం పాటించేలా చూస్తున్నామని జైలు అధికారులు తెలిపారు.