రాష్ట్రపతితో ప్రధాని భేటీ, కొత్త ఏడాది శుభాకాంక్షలు.. దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై వివరణ

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ..

రాష్ట్రపతితో ప్రధాని భేటీ, కొత్త ఏడాది శుభాకాంక్షలు.. దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై వివరణ

Updated on: Dec 30, 2020 | 10:21 PM

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా రాష్టపతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి కోవింద్‌కు మోదీ వివరించారని రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్ వెల్లడించింది. కొత్త ఏడాది భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని వ్యక్తం చేశారని పేర్కొంది.