Agra Road Accident: అదుపు తప్పి ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ముగ్గురు బాలురు దుర్మరణం
Agra Road Accident: ఓ కారు అదుపు తప్పి ట్రక్కు కిందకు దూసుకెళ్లడంతో ముగ్గురు బాలురు బలైన సంఘటన ఆగ్రాలోని కుందోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆగ్రా...

Agra Road Accident: ఓ కారు అదుపు తప్పి ట్రక్కు కిందకు దూసుకెళ్లడంతో ముగ్గురు బాలురు బలైన సంఘటన ఆగ్రాలోని కుందోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం ఆగ్రా-ఫతేహాబాద్‌లో రహదారిపై ఈ ఘటన విషాదంగా మారింది. కుందోల్ ప్రాంతానికి చెందిన కృష్ణకాంత్ (16), ప్రవీణ్ (15), ఆకాశ్ సింగ్ (18)లు తమ స్నేహితుడి తండ్రికి చెందిన కారులో నగరంలో షికారు చేసేందుకు బయలుదేరారు. ఆగ్రా-ఫతేహాబాద్ రహదారిపైకి రాగానే కారు అదుపు తప్పి ఓ ట్రక్కు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కారులోనే మృతి చెందారు. ఈ ప్రమాదంతో కారు నుజ్జు నుజ్జు అయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన కృష్ణకాంత్ సింగ్ 9వ తరగతి, ప్రవీణ్ , ఆకాశ్ సింగ్ లు ఇంటర్మీడియేట్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్ననట్లు ఆగ్రా ఎస్పీ వెంకటేష్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
