Big Breaking : కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం

|

Aug 11, 2020 | 3:22 PM

మాస్కోలోని గామలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెగ్యులేటరీ ఆమోదం ఇచ్చింది.

Big Breaking : కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం
Follow us on

Russia first coronavirus vaccine :మాస్కోలోని గామలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెగ్యులేటరీ ఆమోదం ఇచ్చింది. ఈ విష‌యాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం వెల్ల‌డించారు. రెండు నెల‌ల కంటే త‌క్కువ హ్యూమ‌న్ ట్ర‌యిల్స్ అనంత‌రం ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి వ్యాక్సిన్ తామే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న కుమార్తె సైతం టీకా వేయించుకున్న‌ట్లు తెలిపారు. ర‌క్ష‌ణ‌, సమర్థతను పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్ చివరి స్టేజ్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ, ర‌ష్యాలోని భారీ జ‌నాభాకు వ్యాక్సిన్ అందిచేందుకు త్వ‌ర‌గా అప్రూవ్ చేసినట్లు ఆయ‌న వివ‌రించారు. రాష్ట్ర టెలివిజన్‌లో జరిగిన ప్రభుత్వ సమావేశంలో మాట్లాడిన పుతిన్, మాస్కోలోని గామలేయ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన టీకా సురక్షితం అని, అది తన కుమార్తెలలో ఒకరికి కూడా ఇవ్వబడిందని చెప్పారు.

“ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నాకు తెలుసు, బలమైన రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుంది, నేను మ‌ళ్లీ చెప్తున్నాను, ఇది అవసరమైన అన్ని ప‌రీక్ష‌ల్లో పాస్ అయ్యింది” అని పుతిన్ అన్నారు.

 

Also Read : మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల మాన‌వ‌త్వానికి ఎయిర్ ఇండియా స‌లాం