వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు కొత్త బిల్లులను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిని పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది మోదీ సర్కార్. తాజాగా ఈ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఇవి చట్టాలుగా మారాయి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాలలో నిరసనలు వెల్లవెత్తుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
ఈ బిల్లులు రైతుల ప్రయోజనాలను హరించేలా ఉన్నాయంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్.డి.ఏ మిత్ర పక్షమైన శిరోమణి అకాలీదళ్ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగింది. అంతేకాదు ఏకంగా ఎన్.డి.ఏ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు శనివారం భారత్ బంద్ కూడా చేశాయి.
Also Read :