Donation Drive for Ram Mandir: రామమందిర నిర్మాణానికి మొదటి విరాళంగా రూ. 5 లక్షలను ఇచ్చిన రాష్ట్రపతి

|

Jan 15, 2021 | 6:25 PM

ప్రతి హిందువు కల అయోధ్యలోని రామమందిర నిర్మాణం.. ఊరువాడా రాముడి గుడి ఉన్నా ఆయన జన్మించిన అయోధ్యలో మాత్రం అయన గుడి కరువైంది.  ఎన్నో సంవత్సరాల భారతీయుల కల త్వరలో నెరవేరబోతోంది. తాజాగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి..

Donation Drive for Ram Mandir:  రామమందిర నిర్మాణానికి మొదటి విరాళంగా రూ. 5 లక్షలను ఇచ్చిన రాష్ట్రపతి
Follow us on

Donation Drive for Ram Mandir: ప్రతి హిందువు కల అయోధ్యలోని రామమందిర నిర్మాణం.. ఊరువాడా రాముడి గుడి ఉన్నా ఆయన జన్మించిన అయోధ్యలో మాత్రం అయన గుడి కరువైంది.  ఎన్నో సంవత్సరాల భారతీయుల కల త్వరలో నెరవేరబోతోంది. తాజాగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం ఇచ్చారు. ఈమేరకు రూ. 5,00,100 చెక్కును రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులకు రాష్ట్రపతి అందించారు. మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌ శుక్రవారం ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలో మొదట విరాళం సేకరించడానికి రామ జన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితర ప్రతినిధులు ఈ ఉదయం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రూ.5లక్షల చెక్కును రామ్‌నాథ్‌ కోవింద్‌ విరాళంగా అందించారు. నిధి సేకరణలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా దేశంలోని ప్రముఖులను కలిసి విరాళాలు అడగనున్నారు. నిధుల సేకరణలో పారదర్శకత ఉండేందుకు గానూ.. రూ. 20వేలు అంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చే విరాళాన్ని చెక్కుల రూపంతో తీసుకోనున్నట్లు పేర్కొంది. అంతేగాక, రూ. 2వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని నిర్ణయించింది. విరాళాల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్‌ భావిస్తోంది.

Also Read:
కొణిదెలవారింట వైభవంగా సంక్రాంతి సంబరాలు.ఈసారి కొత్తఅల్లుడే కాదు..అనుకోని అతిథి కూడా