నేటి నుంచి మూడు రోజుల పాటు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయమే శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం, చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటకు వెళతారు. కాగా, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్, ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఇక చంద్రయాన్-2 ప్రయోగం అనంతరం శ్రీహరి కోట నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.