గుడ్ న్యూస్.. టెన్త్ విద్యార్ధులకు నేరుగా మెమోలు.. గ్రేడింగ్‌కు రంగం సిద్దం.!

పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అందరూ కూడా పాస్ కాబట్టి.. ఫలితాలను ప్రకటించడం కంటే నేరుగా మెమోలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తులు ప్రారంభించింది.

గుడ్ న్యూస్.. టెన్త్ విద్యార్ధులకు నేరుగా మెమోలు.. గ్రేడింగ్‌కు రంగం సిద్దం.!

Updated on: Jun 14, 2020 | 8:32 AM

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో టెన్త్ పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులందరినీ ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పుడు వారికి ఇంటర్నల్ మార్కులు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్ధులకు ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని 5 రెట్లు చేసి గ్రేడ్లు ఇవ్వనుంది.

అటు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అందరూ కూడా పాస్ కాబట్టి.. ఫలితాలను ప్రకటించడం కంటే నేరుగా మెమోలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తులు ప్రారంభించింది. ఇక ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అయితే.. సుమారు లక్షన్నర మంది విద్యార్ధులకు ఇంటర్నల్స్‌లో 20కి 20 వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు.

విద్యార్ధులందరినీ కూడా పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అందరూ కూడా పైతరగతులకు ప్రమోట్ అయినట్లే. దీనితో ఫెయిల్ అయ్యేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఉండదని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది.