గర్భాన్ని మోస్తూనే విధి నిర్వహణ.. గ్రామస్తులే పెద్దలయ్యారు!

|

May 09, 2020 | 6:00 PM

కరోనా కష్ట కాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒకవైపు కొందరు దాడులకు దిగుతుంటే... ఇంకోవైపు మరికొందరు వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తూ గౌరవిస్తున్నారు. ఇదే తరహా అయినా మరో విభిన్నమైన గౌరవం దక్కింది తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసే ఇద్దరు మహిళా పోలీసులకు.

గర్భాన్ని మోస్తూనే విధి నిర్వహణ.. గ్రామస్తులే పెద్దలయ్యారు!
Follow us on

కరోనా కష్ట కాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒకవైపు కొందరు దాడులకు దిగుతుంటే… ఇంకోవైపు మరికొందరు వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తూ గౌరవిస్తున్నారు. ఇదే తరహా అయినా మరో విభిన్నమైన గౌరవం దక్కింది తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసే ఇద్దరు మహిళా పోలీసులకు. గర్భవతులుగా వుండి, కరోనా కష్ట కాలంలో విధినిర్వహణకు పాటుపడుతున్న ఇద్దరు మహిళా పోలీసులకు ప్రజలే సీమంతం చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఇద్దరు మహిళా పోలీసులు గర్భవతులుగా ఇబ్బంది పడుతూనే విధి నిర్వహణకు పాటుపడుతున్నారు. కరోన మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ అమలులో వృత్తి బాధ్యతల కారణంగా విశ్రాంతి కోసం సెలవు కూడా తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు సావిత్రి, జయ శాంతి అనే మహిళా పోలీసలు. వీరి సేవా నిరతిని, విధి నిర్వహణలో చిత్తశుద్దిని గుర్తించారు పేదల సంఘం వ్యవస్థాపకులు ప్రసాద్. వీరిద్దరికీ పేదల సంఘం ఆధ్వర్యంలో సీమంతం ఏర్పాటు చేశారు.

తక్కువ మందితో సీమంతం జరిపిస్తామని పోలీసుల అనుమతి తీసుకున్న పేదల సంఘం వ్యవస్థాపకులు ప్రసాద్.. స్థానికులు, పోలీసుల సమక్షంలో ఇద్దరు మహిళ పోలీసులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి, జయశాంతి విధి నిర్వహణలో చూపిస్తున్న చిత్తశుద్దిని పలువురు ప్రశంసించారు.