
జెడ్ స్పీడ్‌తో పరిగెత్తిన గోల్డ్ రేట్స్ నేడు కాస్త తగ్గాయి. కాకపోతే త్వరలోనే రూ.40,000 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ఇవాళ రూ.38,960కి చేరింది. బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణతో పసిడి పరుగుకు అడ్దుకట్టపడింది. బులియన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.37,963 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ధరల స్థిరత్వం కొనసాగుతోంది. ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1,500 డాలర్లకు కాస్త అటు ఇటుగా ఉంది.