నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది.
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ జూలై 5న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. రైతుల సమస్యలు, వ్యవసాయం, ఉద్యోగం లాంటి అంశాలను బడ్జెట్‌లో ఫోకస్ చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బడ్జెట్‌లో రైతులకు, మధ్యతరగతి వారికి కొన్ని రాయితీలు ప్రకటించారు. మాజీ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్.. తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా, నిర్మాణ రంగాలపైన కూడా కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేయనున్నారు. చిన్న తరహా పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియాకు కూడా కేటాయింపులు పెంచనున్నారు. ఎఫ్‌డీఐ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Union Minister Prakash Javadekar: Union Budget will be presented on July 5 https://t.co/48QsaRt478
— ANI (@ANI) May 31, 2019