AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిసంద్రాన సీనీ ఫక్కీలో ప్రకాశం జిల్లా మత్యకారుల బిగ్ ఫైట్.. బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు, దాడులు

ప్రకాశం జిల్లా మత్స్యకారులు గ్రూపులుగా విడిపోయి సముద్రంలో రచ్చ రచ్చ చేశారు. నడిసంద్రంలో బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు చేసుకున్నారు...

నడిసంద్రాన సీనీ ఫక్కీలో ప్రకాశం జిల్లా మత్యకారుల బిగ్ ఫైట్.. బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు, దాడులు
Venkata Narayana
|

Updated on: Dec 03, 2020 | 4:47 AM

Share

ప్రకాశం జిల్లా మత్స్యకారులు గ్రూపులుగా విడిపోయి సముద్రంలో రచ్చ రచ్చ చేశారు. నడిసంద్రంలో బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు చేసుకున్నారు. వీరి గొడవకు కారణం చేపల వేటకు వాడే వల. చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం బల్ల-వలను వాడుతున్నారు. ఆ వలతో మత్స్యసంపద నశిస్తోందని.. చిన్న చిన్న చేప పిల్లలు, చేప గుడ్లు సైతం నాశనం అవుతున్నాయనేది కఠారిపాలెం గ్రామ మత్స్యకారుల అభ్యంతరం. చుట్టు పక్కల 77 గ్రామాలతో జట్టు కట్టి.. వాడరేవు వలలపై తిరుగుబాటు చేశారు. చేపల వేటకు బల్ల-వల వాడకూడదని పట్టుబట్టారు. అయితే.. వీరి వార్నింగ్‌ను పట్టించుకోకుండా.. వాడరేవుకు చెందిన ఓ మత్స్యకారుడు బల్ల-వలతో చేపల వేట చేస్తుండగా.. అతడి బోట్‌ను సముద్రంలో ఛేజ్‌ చేశారు. ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి.. వాడరేవు మత్స్యకారులు కఠారిపాలెం గ్రామస్తులపై తిరుగుబాటు చేశారు. ఈసారి సముద్రంలో కఠారిపాలెం బోట్లను వేంటాడి.. వారి బోట్లను బలవంతంగా తీసుకెళ్లారు.

పరస్పర దాడులతో విషయం మత్స్యశాఖ అధికారులకు, పోలీసుల దగ్గరికి చేరింది. ఇరు వర్గాల మత్స్యకారులను పిలిపించి మీటింగ్‌ పెడితే అక్కడా మళ్లీ గొడవ షురూ అయింది. ప్రభుత్వ నిబంధనల మేరకే బల్ల-వలలను వాడుతున్నామనేది వాడరేవు మత్స్యకారుల మాట. ఈ విషయంలో తమ తప్పేమీ లేదంటున్నారు. అటు.. మీటింగ్‌ అయితే పెట్టారు కానీ, అధికారులూ ఎటూ తేల్చ లేదు. ఇరు వర్గాల వాదనలు విన్నామని.. నిబంధనల మేరకు నడుచుకుంటామని చెబుతున్నారు మత్స్యశాఖ అధికారులు. బల్ల-వల విషయంలో రూల్స్‌ ఏం చెబుతున్నాయో పరిశీలిస్తున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?