
సాహో కోసం సుజీత్ టీమ్ ఎంత కష్టపడిందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కా తెలుగు నేటివిటీ వున్న డైరెక్టరే అయినా.. తన డార్లింగ్ ని నార్త్ కి ఇంకాస్త దగ్గర చేద్దామన్న ప్లానింగ్ తో సాహోకు స్పెషల్ స్కెచ్ గీసుకున్నారు సుజీత్. కట్ చేస్తే.. ఆ సినిమా అక్కడివాళ్లకు బాగానే కనెక్ట్ అయింది. ఇక్కడ మాత్రం బిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. దీనిక్కారణాలు ఎన్నున్నా.. అసలు కారణం మాత్రం ఆ కాస్టింగే. నార్త్ భామ శ్రద్ధా కపూర్ ని మనోళ్లు ఆశించినంతగా జీర్ణించుకోలేకపోయారు. మురళిశర్మ, వెన్నెల కిషోర్ తప్పితే తెలుగు వాసనే లేదు సాహోలో.
ఇప్పుడు నార్త్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్న ఆదిపురుష్ కూడా అదే రూట్లో నడుస్తోంది. ఇప్పటివరకూ వినిపిస్తున్న కాస్టింగ్ డీటెయిల్స్ అన్నీ నార్త్ సైడ్ కి చెందినవే. ప్రభాస్ రాముడిగా చేస్తుంటే తమ్ముడు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ ఫైనల్ అయ్యారు. ఆయన కొడుకుగా మరో బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ కూడా అక్కడివాడే. ఇక సీత పాత్రకు ఫస్ట్ ఛాయిస్ గా క్రితి సనన్ పేరే గట్టిగా వినిపిస్తోంది.
మొత్తం ఐదు సినిమాలకు సైన్ చేసి బాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్నారు క్రితి సనన్. ఆమెకున్న గ్లామరస్ బజ్ ని తన సినిమాకు యూజ్ చేసుకోవాలన్నది ఓం గారి మాస్టర్ ప్లాన్ కావొచ్చు. కానీ.. టాలీవుడ్ లో జస్ట్ ఒక్క సినిమాతోనే పరిచయమున్న క్రితిని.. తెలుగు ఆడియెన్స్ ఎంత మేరకు ఓన్ చేసుకుంటారన్నది మిలియన్ డాలర్ల డౌటే. సినిమాలో ఒక్క ప్రభాస్ మినహాయిస్తే ఏ టు జెడ్ అన్నీ నార్త్ కలర్సే కనిపించడం.. ఆదిపురుష్ కి సౌత్ లో ప్లస్సా లేక మైనస్సా..! అనేది ఆ డైరెక్టర్ గారికే తెలియాలి. ఏదేమైనా సాహో నాటి బిట్టర్ ఎక్స్ పీరియన్స్ రిపీట్ కాకూడన్నది డైహార్డ్ ఫ్యాన్స్ కోరిక.
Also Read :
హత్యాయత్నంపై స్పందించిన పేర్ని నాని, కృష్ణా జిల్లా ఎస్పీ.. నిందితుడు అందుకే దాడి చేశాడట
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి